ఫిక్సింగ్ ఆరోపణలు.. దేశవాళీ క్రికెటర్ చిదంబరం గౌతమ్ ను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు!

  • బుకీల నుంచి రూ. 20 లక్షలు
  • నిదానంగా ఆడేందుకు డబ్బు తీసుకున్న గౌతమ్
  • మరో క్రికెటర్ కాజీ కూడా అరెస్ట్
నిదానంగా బ్యాటింగ్ చేసేందుకు బుకీల నుంచి రూ. 20 లక్షలు అందుకుని స్పాట్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దేశవాళీ క్రికెటర్‌ చిదంబరం మురళీధరన్‌ గౌతమ్‌ ను బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కర్ణాటక ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్న వేళ, సహచర క్రికెటర్ అబ్రార్ కాజీతో కలిసి బళ్లారి టస్కర్స్ కు ప్రాతినిథ్యం వహించిన గౌతమ్, అతనితో కలిసి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు. బుకీల నుంచి డబ్బులు తీసుకుని హుబ్లీతో జరిగిన మ్యాచ్ లో అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సాక్ష్యాలు సేకరించిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు, తొలుత కాజీని, ఆపై గౌతమ్ ను అరెస్ట్ చేశారు. ఈ జోడీకి డబ్బులిచ్చిన బుకీలను గుర్తించేందుకు వారిని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
Cricket
Gautam
Fixing
Arrest

More Telugu News